Thursday, October 8, 2020

Vitamin D


విటమిన్-D.. తక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే…

ఈ ఏడాది సగం ఇంట్లోనే గడిచిపోయింది. ఎండ తగలడమే గగనమైపోయింది. దీంతో విటిమిన్‌‌‌‌ డి లోపం తలెత్తుతోంది. విటమిన్‌‌‌‌ డి తక్కువైతే చాలా ప్రాబ్లమ్స్‌‌‌‌ వస్తాయి. 

బాడీలో క్యాల్షియంను అబ్జార్బ్​ చేసేందుకు విటమిన్‌‌‌‌ –డి ఉపయోగపడుతుంది. రోజూ డైరీ ప్రాడెక్ట్స్‌‌‌‌ తిన్నప్పటికీ విటమిన్‌‌‌‌– డి లోపం ఉంటే అవి ప్రభావం చూపదు. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. బోన్స్‌‌‌‌ స్ట్రాంగ్‌‌‌‌గా ఉండాలంటే డెయిరీ ప్రొడక్ట్స్‌‌‌‌తో పాటు విటమిన్‌‌‌‌ డి కూడా ఉండేలా చూసుకోవాలి.

సన్‌‌‌‌షైన్‌‌‌‌ విటమిన్‌‌‌‌ మన మూడ్‌‌‌‌ను కూడా రెగ్యులేట్‌‌‌‌ చేస్తుంది. అందుకే విటమిన్‌‌‌‌ డి లోపం ఉంటే డిప్రషన్‌‌‌‌ పెరుగుతుందని స్టడీస్‌‌‌‌ చెప్తున్నాయి. ఎండలో బయటికి వెళ్లడం వల్ల మన మూడ్‌‌‌‌ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు.

విటమిన్‌‌‌‌– డి డైరెక్ట్‌‌‌‌గా మన ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. బాడీలోని ఇన్‌‌‌‌ఫెక్షన్స్‌‌‌‌, ఇల్‌‌‌‌నెస్‌‌‌‌పై పోరాడుతుంది. విటమిన్‌‌‌‌– డి లోపం ఉంటే జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుందని, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జర్మనీలోని జీనా యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌ చేసిన సర్వేలో తేలింది.

రోజూ పడుకున్నా, రెస్ట్‌‌‌‌ తీసుకున్నా అలసటగా అనిపిస్తే అది విటమిన్‌‌‌‌– డి తక్కువగా ఉందని సంకేతం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రోజువారి పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

విటమిన్ –డి పుష్కలంగా ఉంటే జుట్టు పెరుగుతుంది. పొల్యూషన్‌‌‌‌, స్ట్రెస్‌‌‌‌ లాంటి వాటితో పాటు విటమిన్‌‌‌‌– డి లోపం ఉంటే కూడా హెయిర్‌‌‌‌‌‌‌‌ లాస్‌‌‌‌ అవుతుంది.